‘ధోని రనౌట్‌ కావడం నా అదృష్టం’

Martin Guptil Says Lucky Enough to Get a Direct Hit From Out There - Sakshi

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌

మాంచెస్టర్‌ : డైరెక్ట్‌ హిట్‌తో భారత ఆశలను సమాధి చేసిన న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ ఆ రనౌట్‌పై స్పందించాడు. టీమిండియా ఫినిషర్‌ మహేంద్ర సింగ్‌ ధోని రనౌట్‌ కావడం తన అదృష్టమని పేర్కొన్నాడు. భారత్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గప్టిల్‌ తన అద్భుత ఫీల్డింగ్‌తో ధోనిని పెవిలియన్‌ను చేర్చిన విషయం తెలిసిందే. భారత విజయానికి 12 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని ఓ భారీ సిక్స్‌ కొట్టి గెలుపు ఆశలను రేకిత్తించాడు. ఆ మరుసటి బంతిని వదిలేసిన మూడో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో గప్టిల్‌ డైరెక్ట్‌ త్రోకు ఔటయ్యాడు. ఈ ఔట్‌తో ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. అయితే బ్యాటింగ్‌తో ఆకట్టుకోని గప్టిల్‌ ఈ ఒక్క రనౌట్‌తో హీరో అయ్యాడు. ఈ రనౌట్‌పై ఐసీసీ ట్వీట్‌ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘ఎంత అదృష్టం ఉంటే ధోనిని కీలక సమయంలో డైరెక్ట్‌ హిట్‌తో ఔట్‌ చేస్తాను’ అని సంబరపడిపోయాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top