మార్క్‌ బౌచర్‌కు కీలక పదవి | Mark Boucher Appointed As South Africa Head Coach | Sakshi
Sakshi News home page

మార్క్‌ బౌచర్‌కు కీలక పదవి

Dec 14 2019 9:20 PM | Updated on Dec 14 2019 9:20 PM

Mark Boucher Appointed As South Africa Head Coach - Sakshi

మాజీ వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు కీలక పదవిని కట్టబెట్టింది

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా మాజీ వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు కీలక పదవిని కట్టబెట్టింది. బౌచర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని క్రికెట్‌ దక్షిణాఫ్రికా డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ అధికారికంగా ప్రకటించాడు. వరల్డ్‌ కప్‌లో ఘోర ఓటమి, వరుస వైఫల్యాలు, బోర్డులో అంతర్గత సమస్యలతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంక్షభంలో చిక్కుకుంది. దీంతో ప్రొటీస్‌ క్రికెటన్‌ చక్కదిద్దే బాధ్యతను మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌కు అప్పగించింది. దీనిలో భాగంగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మిత్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. 

త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌ నుంచి దక్షిణాఫ్రికాకు ప్రధాన కోచ్‌గా బౌచర్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు 2023 వరకు బౌచర్‌తో క్రికెట్‌ సౌతాఫ్రికా కాంట్రాక్ట్‌ చేసుకుంది. అయితే తొలుత తాత్కాలిక కోచ్‌గా నియమించినట్టు అందరూ భావించారు. అయితే బౌచర్‌తో మూడేళ్లకు గాను కాంట్రాక్ట్‌ చేసుకున్నట్టు స్మిత్‌ తెలపడంతో అతడు పూర్తిస్థాయి కోచ్‌గా ఎంపికైనట్టు స్పష్టమైంది. మార్క్‌ బౌచర్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్‌ అష్వెల్‌ ప్రిన్స్‌ను అదనపు సహాయక కోచ్‌గా ఎంపిక చేశామని స్మిత్‌ పేర్కొన్నాడు. ప్రస్తుత సహాయక కోచ్‌గా ఉన్న ఎనోచ్ ఎంక్వేతో కలిసి ప్రిన్స్‌ పనిచేయనున్నాడు. 

ఇక 2012లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బౌచర్‌ ఆతర్వాత 2016లో కోచ్‌ అవతారం ఎత్తాడు. దేశవాళీ క్రికెట్‌లో టైటాన్స్‌ జట్టుకు కోచ్‌గా పనిచేసిన అనుభవంగా ఈ దిగ్గజ వికెట్‌ కీపర్‌కు ఉంది. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో బెస్ట్‌ కోచ్‌గా బౌచర్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సత్కరించింది. ఇక వికెట్‌ కీపర్‌గా దక్షిణాఫ్రికాకు సుదీర్ఘకాలం తన సేవలందించిన బౌచర్‌ ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రికార్డు ఛేజింగ్‌ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై చివరి బంతికి బౌండరీ సాధించిన సఫారీ జట్టుకు విజయాన్నందించింది బౌచరే అన్న విషయం తెలిసిందే. ఇక 147 టెస్టులు ఆడిన బౌచర్‌ ఓవరాల్ అంతర్జాతీయ కెరీర్‌లో 999 ఔట్లలో ఈ వికెట్‌ కీపర్‌ భాగస్వామ్యమయ్యాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement