లీ చోంగ్‌ వీ... నాలుగోసారి | Malaysian star Lee Chong Wei won the All England title | Sakshi
Sakshi News home page

లీ చోంగ్‌ వీ... నాలుగోసారి

Mar 13 2017 1:06 AM | Updated on Sep 5 2017 5:54 AM

లీ చోంగ్‌ వీ... నాలుగోసారి

లీ చోంగ్‌ వీ... నాలుగోసారి

మోకాలి గాయంతో బాధపడుతూనే టోర్నీ ఆసాంతం ఆడిన మలేసియా బ్యాడ్మింటన్‌ స్టార్‌ లీ చోంగ్‌ వీ

ఆల్‌ ఇంగ్లండ్‌ టైటిల్‌ నెగ్గిన మలేసియా స్టార్‌

బర్మింగ్‌హామ్‌: మోకాలి గాయంతో బాధపడుతూనే టోర్నీ ఆసాంతం ఆడిన మలేసియా బ్యాడ్మింటన్‌ స్టార్‌ లీ చోంగ్‌ వీ... ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ లీ చోంగ్‌ వీ 21–12, 21–10తో పదో ర్యాంకర్‌ షి యుచి (చైనా)పై గెలిచాడు.

లీ చోంగ్‌ వీ ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించడం ఇది నాలుగోసారి. గతంలో అతను 2010, 2011, 2014లలో ఈ టైటిల్‌ గెలిచాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) తొలిసారి టైటిల్‌ సాధించింది. ఫైనల్లో తై జు యింగ్‌ 21–16, 22–20 ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గింది. ఈ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ పీవీ సింధుపై తై జు యింగ్‌ నెగ్గిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement