టాప్ ఆర్డరే కొంప ముంచింది: ధోని | Mahendra Singh Dhoni chides top-order batsmen for poor show | Sakshi
Sakshi News home page

టాప్ ఆర్డరే కొంప ముంచింది: ధోని

Aug 10 2014 11:17 AM | Updated on Sep 2 2017 11:41 AM

టాప్ ఆర్డరే కొంప ముంచింది: ధోని

టాప్ ఆర్డరే కొంప ముంచింది: ధోని

టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వైఫల్యమే తమ కొంప ముంచిందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వాపోయాడు.

మాంచెస్టర్: టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వైఫల్యమే తమ కొంప ముంచిందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వాపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మూడంకెల స్కోరు కూడా చేయకుండానే వెనుదిరగడంతో తాము ఘోరంగా ఓడిపోయామని చెప్పాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో విజయం సాధించడంతో టాప్ ఆర్డర్ ఆటగాళ్ల వైఫల్యం కనపించకుండాపోయిందని, మరిన్ని పరుగులు చేయాల్సిందని వారికి చెప్పలేని పరిస్థితి తలెత్తిందన్నాడు.

తమ ఐదో బౌలర్ చేసినన్ని పరుగులు కూడా టాప్ ఆర్డర్ బ్యాట్మన్ సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 54 పరుగులతో చిత్తుగా ఓడింది. తొలి ఇన్నింగ్సలో భారత్ 8 పరుగలకే 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ లోనూ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో టీమిండియాకు భంగపాటు తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement