రన్నరప్ పేస్ జంట | Leander Paes-Andre Begemann enter ATP Winston-Salem Open final | Sakshi
Sakshi News home page

రన్నరప్ పేస్ జంట

Aug 28 2016 1:20 AM | Updated on Sep 4 2017 11:10 AM

రన్నరప్ పేస్ జంట

రన్నరప్ పేస్ జంట

ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశే మిగిలింది.

విన్‌స్టన్-సాలెమ్ (అమెరికా): ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు నిరాశే మిగిలింది. శనివారం జరిగిన విన్‌స్టన్-సాలెమ్ ఓపెన్ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో పేస్-ఆండ్రీ బెగెమన్ (జర్మనీ) ద్వయం 6-4, 6-7 (6/8), 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెరుున్)-హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్) జంట చేతిలో ఓడిపోరుుంది. రెండో సెట్‌లో టైబ్రేక్‌లో పేస్ జంటకు మూడు మ్యాచ్ పారుుంట్లు లభించినా ఫలితం లేకపోరుుంది.

2015 జనవరిలో ఆక్లాండ్ ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత పేస్ మరో డబుల్స్ టైటిల్ గెలువలేకపోయాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో పేస్-బెగెమన్ ద్వయం 1-6, 7-6 (7/5), 10-4తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ లిండ్‌స్టెడ్ (స్వీడన్)-ఐజామ్ ఉల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్) జోడీపై గెలిచింది. రన్నరప్‌గా నిలిచిన పేస్ జంటకు 18,470 డాలర్ల (రూ. 12 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement