విజేత కోనేరు హంపి

Koneru Humpy Wins  First Tournament Of FIDE Women Grand Prix - Sakshi

స్కోల్‌కోవో మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నీ

8 పాయింట్లతో అగ్రస్థానం

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్, భారత మహిళల నంబర్‌వన్‌ చెస్‌ ప్లేయర్, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ కోనేరు హంపి అద్భుతం చేసింది. రష్యాలోని స్కోల్‌కోవోలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి (డబ్ల్యూజీపీ) సిరీస్‌ 2019–2020 తొలి టోరీ్నలో ఆమె చాంపియన్‌గా అవతరించింది. ఆరేళ్ల విరామం తర్వాత హంపి డబ్ల్యూజీపీ టైటిల్‌ సాధించడం విశేషం. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో 32 ఏళ్ల హంపి అజేయంగా నిలిచింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోరీ్నలో ఆమె 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. 7.5 పాయింట్లతో జు వెన్‌జున్‌ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో జరిగిన చివరి గేమ్‌ను హంపి 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.

ఓవరాల్‌గా ఈ టోరీ్నలో హంపి ఐదు గేముల్లో గెలిచి, ఆరింటిని ‘డ్రా’గా ముగించింది. ద్రోణవల్లి హారిక (భారత్‌), మేరీ సెబాగ్‌ (ఫ్రాన్స్‌),  కొస్టెనిక్‌ (రష్యా), గొర్యాచికినా (రష్యా), కాటరీనా లాగ్నో (రష్యా), జు వెన్‌జున్‌ (చైనా)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి... అలీనా కాష్‌లిన్‌ స్కాయ (రష్యా), పియా క్రామ్లింగ్‌ (స్వీడన్‌), స్టెఫనోవా (బల్గేరియా), ఎలిజబెత్‌ పెట్జ్‌ (జర్మనీ), వాలెంటినా గునీనా (రష్యా)లపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన హంపికి 15 వేల యూరోల (రూ. 11 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 160 పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ హారిక ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.

►7 హంపి కెరీర్‌లో నెగ్గిన గ్రాండ్‌ప్రి టైటిల్స్‌. తాజా టైటిల్‌కంటే ముందు ఆమె 2013లో దిలిజాన్‌ (అర్మేనియా), తాషె్కంట్‌ (ఉజ్బెకిస్తాన్‌); 2012లో కజాన్‌ (రష్యా), అంకారా (టరీ్క); 2009లో ఇస్తాంబుల్‌ (టరీ్క), దోహా (ఖతర్‌) టోరీ్నల్లో
విజేతగా నిలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top