హంపి జట్టుకు టైటిల్ | koneru hampi team wins title | Sakshi
Sakshi News home page

హంపి జట్టుకు టైటిల్

Oct 28 2013 1:00 AM | Updated on Sep 4 2018 5:07 PM

హంపి జట్టుకు టైటిల్ - Sakshi

హంపి జట్టుకు టైటిల్

ప్రతిష్టాత్మక యూరోపియన్ క్లబ్ కప్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రాతినిధ్యం వహించిన సర్కిల్ డిచెక్స్ డి మోంటెకార్లో (మొనాకో) జట్టు విజేతగా నిలిచింది.

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక యూరోపియన్ క్లబ్ కప్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రాతినిధ్యం వహించిన సర్కిల్ డిచెక్స్ డి మోంటెకార్లో (మొనాకో) జట్టు విజేతగా నిలిచింది.  హంపి క్లబ్ ఆడిన ఏడు రౌండ్లలో అజేయంగా నిలిచింది. మొత్తం 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

మొనాకో జట్టుకు యూరోపియన్ క్లబ్ కప్ దక్కడం ఇది ఐదోసారి కావడం విశేషం. మొనాకో జట్టులో హంపితోపాటు ప్రపంచ చాంపియన్ హూ ఇఫాన్ (చైనా), అన్నా ముజిచుక్ (స్లొవేనియా), పియా క్రామ్లింగ్ (స్వీడన్), అల్మీరా స్కిర్ప్‌చెంకో (ఫ్రాన్స్) సభ్యులుగా ఉన్నారు. వ్యక్తిగత విభాగాల్లో హంపి బోర్డు-2లో విజేతగా నిలిచింది. హంపి ఆడిన ఏడు గేముల్లో ఐదింటిలో గెలిచి మిగతా రెండింటిని ‘డ్రా’ చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement