కుప్పకూలిన కోల్ కతా నైట్ రైడర్స్ | Kolkatha set target of 132 runs | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన కోల్ కతా నైట్ రైడర్స్

Apr 23 2017 10:23 PM | Updated on Sep 5 2017 9:31 AM

కుప్పకూలిన కోల్ కతా నైట్ రైడర్స్

కుప్పకూలిన కోల్ కతా నైట్ రైడర్స్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు స్పిన్ మాయాజాలానికి కోల్ కతా కుప్పకూలింది.

► నరైన మినహా అందరూ విఫలం
► బెంగళూరు లక్ష్యం 132


కోల్ కతా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు స్పిన్ మాయాజాలానికి కోల్ కతా నైట్ రైడర్స్ కుప్పకూలింది. ఓపెనర్ సునీల్ నరైన్ మినహా మిగతా బ్యాట్సమెన్స్ తక్కువ స్కోర్ల కే పేవిలియన్ చేరడంతో కోల్ కతా 19.3 ఓవర్లకు 131 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు తొలి ఓవర్లలో పరుగులు ఇచ్చుకున్న తర్వాతి ఓవర్లో కట్టడి చేసింది. 

తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో విరుచుకుపడ్డ సునీల్ నరైన్, 6 ఫోర్లు ఒక సిక్సర్ తో 34 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ ను తైమల్ మిల్స్ అవుట్ చేయగా, బిన్ని నరైన్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మెన్ క్రీజులో నిలదొక్కుకోలేక పోయాడు. బెంగళూరు స్పిన్నర్ యజువేంద్ర చాహాల్ కు మూడు వికెట్లు, మరో స్పిన్నర్ పవన్ నెగికి 2 వికెట్లు, ఎస్ బద్రీకి ఒక వికెట్ దక్కింది. ఇక పేస్ బౌలర్స్ లో మిల్స్ రెండు వికెట్లు, బిన్ని, ఎస్ అరవింద్ లకు చెరో వికెట్ దక్కాయి.

Advertisement
 
Advertisement
Advertisement