కోహ్లి.. మీ జట్టులోకి తీసుకుంటావా?: పీటర్సన్‌

Kohli responds To Pietersen's Post Kid Flaunting Batting - Sakshi

న్యూఢిల్లీ: గత నెలలో ఒక బుడతడు క్రికెట్‌ ఆడుతున్న  వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇంకా డైపర్స్‌లోనే ఆ బుడ్డోడు సహజ సిద్ధమైన క్రికెట్‌ షాట్లతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.  క్లబ్‌ క్రికెటర్లను మించిపోయి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లనే మైమరిపిస్తున్నాడు. కచ్చితమైన షాట్లతో చక్కని టైమింగ్‌తో బంతిని అంచనా వేస్తూ షాట్లు కొట్టేస్తున్నాడు.దిగ్గజ క్రికెటర్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సైతం ముగ్థుడైపోయాడు. మొత్తం బ్యాటింగ్‌ను ఒడిసి పట్టేసుకున్నాడా అంటూ కొనియాడాడు.ఈ బుడతడు బహుశా ఇంగ్లండ్‌ గడ్డపైనే పుట్టి ఉంటాడంటూ కితాబు కూడా ఇచ్చేశాడు.(ఇక్కడ చదవండి: డైపర్స్‌ బుడతడు.. క్రికెటర్లను మించి ఆడేస్తున్నాడు!)

ఇది ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి చేరింది. ఈ చిన్నోడి వీడియోను షేర్‌ చేసిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌.. కోహ్లి ముందు ఒక ప్రశ్న ఉంచాడు. ‘ వాటే బ్యాటింగ్‌.. ఈ పిల్లోడ్ని మీ జట్టులోకి తీసుకుంటావా. మీ స్వ్కాడ్‌లో ఎంపిక చేయగలవా’ అంటూ కోహ్లిని అడిగాడు. ఆ బుడతడి బ్యాటింగ్‌కు ఫిదా అయిన కోహ్లి.. ‘ ఇది నమ్మ శక్యంగా లేదు. ఇంతకీ ఆ చిన్నోడు ఎక్కడి వాడు’ అంటూ కోహ్లి ఆసక్తిని ప్రదర్శించాడు.దీనిపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వస్‌ కల్లిస్‌ కూడా స్పందిస్తూ.. ‘ అతనిలో చాలా టాలెంట్‌ ఉంది. డైపర్స్‌ వేసుకునే వయసులోనే ఇలా ఆడేస్తున్నాడేమిటి’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top