డైపర్స్‌ బుడతడు.. క్రికెటర్లను మించి ఆడేస్తున్నాడు!

A Child In Diapers Plays Natural Cricket Shots - Sakshi

న్యూఢిల్లీ: ఆ బుడతడు ఇంకా డైపర్స్‌లోనే ఉన్నాడు..కానీ సహజ సిద్ధమైన క్రికెట్‌ ఆడేస్తున్నాడు.క్లబ్‌ క్రికెటర్లను మించిపోయి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లనే మైమరిపిస్తున్నాడు. కచ్చితమైన షాట్లతో చక్కని టైమింగ్‌తో బంతిని అంచనా వేస్తూ షాట్లు కొట్టేస్తున్నాడు. ఒక రూమ్‌లో క్రికెట్‌ షాట్లు ప్రాక్టీస్‌ చేస్తున్న బుడతడి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ కావడంతో దిగ్గజ క్రికెటర్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సైతం ముగ్థుడైపోయాడు. మొత్తం బ్యాటింగ్‌ను ఒడిసి పట్టేసుకున్నాడా అంటూ కొనియాడాడు. ఈ బుడతడు బహుశా ఇంగ్లండ్‌ గడ్డపైనే పుట్టి ఉంటాడంటూ కితాబు కూడా ఇచ్చేశాడు.

ఈ చిన్నోడు ఆటను నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. యువ క్రికెటర్లు ప్రాక్టీస్‌కు ఎలాంటి బంతులు ఆడతారో అలా ప్రాక్టీస్‌ చేస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. ముఖ కవలికల్లో స్టీవ్‌ స్మిత్‌ను తలపిస్తున్నాడు అంటూ మరికొందరు ట్వీట్‌ చేశారు. షాట్ల ఎంపికలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పోలికలు ఉన్నాయని కొందరు ప్రశంసించారు. ఆ బుడతడికి ఇక బౌన్సర్లే వేయాలేమో అంటూ మరొకరు చమత్కరించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top