కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీకాంత్ | Kidambi Srikanth achieves career-best ranking of 10th | Sakshi
Sakshi News home page

కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీకాంత్

Nov 20 2014 5:20 PM | Updated on Sep 2 2017 4:49 PM

కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీకాంత్

కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీకాంత్

చైనా ఓపెన్ టైటిల్ కైవశం చేసుకుని రికార్డు సృష్టించిన భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు.

న్యూఢిల్లీ: చైనా ఓపెన్ టైటిల్ కైవశం చేసుకుని రికార్డు సృష్టించిన భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో శ్రీకాంత్ పరుషుల సింగిల్స్ విభాగంలో 10వ ర్యాంకులో నిలిచాడు. 6 స్థానాలు మెరుగుపరుచుకుని అతడు టాప్ టెన్ లోకి దూసుకొచ్చాడు. పారుపల్లి కశ్యప్ 17వ ర్యాంకులో ఉన్నాడు. 

మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 4వ ర్యాంకులో నిలిచింది. పీవీ సింధు 10వ స్థానంలో కొనసాగుతోంది. డబుల్స్ లో గుత్తా జ్వాల, అశ్విని పొనప్ప 19వ ర్యాంకు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement