‘ప్రపంచ క్రికెట్‌లో నయా ధోని’ | Jos Buttler Is The New MS Dhoni Of World Cricket, Says Langer | Sakshi
Sakshi News home page

‘ప్రపంచ క్రికెట్‌లో నయా ధోని’

Jun 24 2019 5:01 PM | Updated on Jun 24 2019 5:01 PM

Jos Buttler Is The New MS Dhoni Of World Cricket, Says Langer - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌పై ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ప్రశంసలు కురిపించాడు. అతనొక అసాధారణమై ఆటగాడంటూ బట్లర్‌ను కొనియాడాడు. బట్లర్‌ బ్యాటింగ్‌ నైపుణ్యం, ప్రత్యర్తి జట్లపై ఒత్తిడి తీసుకురావడం చూస్తే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనినే గుర్తుకు తెస్తాడని చెప్పుకొచ్చాడు.' బట్లర్‌ అద్భుతమైన ఆటగాడు. అతని బ్యాటింగ్ చూడటం నాకు చాలా ఇష్టం.  అతను బ్యాటింగ్‌ చేయడాన్ని నేను ఎక్కువగా ఆస్వాదిస్తా. వరల్డ్ క్రికెట్‌లో అతను నయా ధోని’ అని ప్రశంసించాడు. 

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బట్లర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా, తమతో జరుగనున్న మ్యాచ్‌లో బట్లర్‌ డకౌట్‌ కావాలని కోరుకుంటున్నానని లాంగర్‌ చమత్కరించాడు.ప్రస్తుత క్రికెట్‌లో చాలా ప్రమాదకరంగా మారాడు. మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో ఉంది. మంగళవారం మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా' అని తెలిపాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement