కోహ్లిపై జోక్‌.. నెటిజన్లు ఫైర్‌ | Jimmy Neesham trolled after his joke on Virat Kohli backfires | Sakshi
Sakshi News home page

కోహ్లిపై జోక్‌.. నెటిజన్లు ఫైర్‌

Aug 3 2019 3:16 PM | Updated on Aug 3 2019 3:20 PM

Jimmy Neesham trolled after his joke on Virat Kohli backfires - Sakshi

వెల్లింగ్టన్‌: ఇటీవల కాలంలో ట్వీటర్‌లో ఆసక్తికర పోస్టులు చేస్తున్న న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జేమ్స్‌ నీషమ్‌.. ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై జోక్‌ వేసి విమర్శల పాలయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ రెండో రోజు ఆటలో 125 పరుగులు చేయడాన్ని ప్రస్తావిస్తూ..ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో కోహ్లి కంటే బర్న్స్‌ ఎక్కువ పరుగులు చేశాడంటూ తన ట్వీటర్‌ అకౌంట్‌లో నీషమ్‌ జోక్‌ చేశాడు. తొలి యాషెస్‌ ఇన్నింగ్స్‌లో కోహ్లి కంటే బర్న్స్‌ ఎక్కువ పరుగులు చేశాడని చమత్కరించాడు. ఇది కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో నీషమ్‌ను ఏకిపారేస్తున్నారు.

‘ వరల్డ్‌కప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరకపోవడంతో ఆ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇవ్వమంటూ ట్వీట్‌ చేశావ్‌.. ఇప్పుడేమో కోహ్లికి బర్న్స్‌కు పోలిక తెస్తున్నావు. ఇది మంచిది కాదు నీషమ్‌’ అని ఒకరు బదలివ్వగా, మరొక అభిమాని మాత్రం టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ యాషెస్‌ సిరీస్‌లో వికెట్లు ఏమీ తీయలేకపోయాడే’ అంటూ సెటైర్‌ వేశాడు. ‘ మొత్తం న్యూజిలాండ్‌ టాపార్డర్‌ ఆటగాళ్లు పరుగులు కంటే కోహ్లి ఒక్కడే ఎక్కువ పరుగులు చేశాడనే విషయం తెలుసుకో నీషమ్‌’ అంటూ మరొకరు వార్నిగ్‌ ఇచ్చారు. ‘ ఆసియా కప్‌లో ఆసీస్‌-ఇంగ్లండ్‌ ఆటగాళ్ల కంటే కోహ్లనే ఎక్కువ పరుగులు చేశాడు’ అని మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. అసలు యాషెస్‌ సిరీస్‌ అనేది ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగేది కాబట్టి.. నీషమ్‌ వేసిన జోక్‌కు అదే తరహాలో బదులిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement