ఓ వైపు ఆనందం..మరోవైపు విషాదం | Jayant Yadav's grandmother passed away while he was batting in the 4th Test | Sakshi
Sakshi News home page

ఓ వైపు ఆనందం..మరోవైపు విషాదం

Dec 15 2016 3:54 PM | Updated on Sep 4 2017 10:48 PM

ఓ వైపు ఆనందం..మరోవైపు విషాదం

ఓ వైపు ఆనందం..మరోవైపు విషాదం

కొన్ని సందర్భాల్లో విధి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు ఆనందాన్నిస్తే, మరొకవైపు విషాదాన్ని కూడా మిగులుస్తుది.

ముంబై:కొన్ని సందర్భాల్లో విధి చాలా విచిత్రంగా ఉంటుంది.  ఒకవైపు ఆనందాన్నిస్తే,  మరొకవైపు విషాదాన్ని కూడా మిగులుస్తుంది. ఇటీవల ఈ తరహా ఘటనే భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ ఇంట ఎదురైంది. ఇంగ్లండ్ తో ముంబైలో జరిగిన టెస్టులో జయంత్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నసమయంలోనే  అతని అమ్మమ్మ కన్నుమూయడం ఆ కుటుంబంలో విషాదాన్ని తీసుకొచ్చింది.

 

'కొడుకు ఆడుతున్న మూడో మ్యాచ్ను టీవీలో ఆసక్తిగా చూస్తున్నా. పెద్ద స్కోరు సాధిస్తాడనే ధీమాతో టీవీకి అతుక్కుపోయా. కాకపోతే అదే సమయంలో మా అత్తయ్య మృతి చెందిందంటూ ఫోన్ వచ్చింది.  దాంతో హడావుడిగా ఢిల్లీ నుంచి జలంధర్ వెళ్లిపోయా. అయితే అక్కడ దిగగానే జయంత్ సెంచరీ చేసిన విషయం తెలిసింది. ఒకవైపు విషాదం..మరొకవైపు ఆనందం. ఏమి చేయాలో తెలియని పరిస్థితి నాది. ఈ విషయాన్ని వెంటనే జయంత్ కు కూడా చెప్పలేదు. సెంచరీ చేసిన మూడ్లో ఉన్న జయంత్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ విషయం ఆలస్యంగా చెప్పాం'అని  తండ్రి జయ్ సింగ్ యాదవ్ విధివిలాపాన్ని గుర్తు చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement