విజేతలు ప్రగ్యాన్ష, జతిన్‌దేవ్‌

Jatin, Pragyansha reign supreme in Cadet category - Sakshi

స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో జతిన్‌ దేవ్, ప్రగ్యాన్ష సత్తా చాటారు. బండ్లగూడలోని మహావీర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్‌ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన క్యాడెట్‌ బాలుర ఫైనల్లో జతిన్‌ దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌) 11–3, 11–3, 12–14, 11–2, 11–13 ,11–6తో ఎం. రిషభ్‌ సింగ్‌ (వైఎంసీఏఎక్స్‌టీటీఏ)పై గెలుపొందాడు. అంతకుముందు సెమీస్‌ మ్యాచ్‌ల్లో జతిన్‌ దేవ్‌ 14–12, 11–7, 11–6తో ధ్రువ్‌ సాగర్‌ (జీఎస్‌ఎం)పై, రిషభ్‌ సింగ్‌ 14–12, 10–12, 4–11, 11–9, 11–6తో శౌర్యరాజ్‌ సక్సేనా (ఏవీఎస్‌సీ)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. బాలికల టైటిల్‌ పోరులో పి. ప్రగ్యాన్ష (వీపీజీ) 11–5, 11–7, 7–11, 11–6, 11–7తో పి. జలాని (వీపీజీ)ని ఓడించి చాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌ మ్యాచ్‌ల్లో ప్రగ్యాన్ష 11–6, 11–3, 11–6తో పి. సన్హిత (కేడబ్ల్యూఎస్‌ఏ)పై, జలాని (వీపీజీ) 8–11, 11–7, 11–4, 11–9తో శ్రేయ (జీఎస్‌ఎం)పై గెలుపొందారు.   

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు  

సబ్‌ జూనియర్‌ బాలుర క్వార్టర్స్‌: ఇషాంత్‌ (ఏడబ్ల్యూఏ) 3–1తో క్రిష్‌ మాల్పానీ (ఏడబ్ల్యూఏ)పై, ఆయుశ్‌ డాగా (ఏడబ్ల్యూఏ) 3–1తో రాజు (ఏడబ్ల్యూఏ)పై, త్రిశూల్‌ మెహ్రా (ఎల్‌బీఎస్‌) 3–1తో కరణ్‌ సప్తర్షి (ఎంఎల్‌ఆర్‌)పై, జషన్‌ సాయి (ఎంఎల్‌ఆర్‌) 3–0తో కె. వరుణ్‌ (జీఎస్‌ఎం)పై నెగ్గారు.
 
బాలికలు: మెర్సీ (హెచ్‌వీఎస్‌) 3–1తో దేవీశ్రీ (ఎంఎల్‌ఆర్‌)పై, అనన్య (జీఎస్‌ఎం) 3–0తో పూజ (ఏడబ్ల్యూఏ)పై, పలక్‌ 3–1తో నందిని (వీపీజీ)పై, ఆశ్లేష సింగ్‌ (ఏడబ్ల్యూఏ) 3–2తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు.

జూనియర్‌ బాలుర ప్రిక్వార్టర్స్‌: త్రిశూల్‌ (ఎల్‌బీఎస్‌) 3–0తో అనూప్‌ (ఎంఎల్‌ఆర్‌)పై, ప్రణవ్‌ నల్లారి (ఏడబ్ల్యూఏ) 3–1తో యశ్‌ గోయల్‌ (జీఎస్‌ఎం)పై, కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ) 3–0తో క్రిష్‌ (ఎంఎల్‌ఆర్‌)పై, రఘురామ్‌ (నల్లగొండ) 3–1తో యశ్‌చంద్ర (పీఆర్‌ఓటీటీ)పై, జషాన్‌ సాయి (ఎంఎల్‌ఆర్‌) 3–1తో శ్రేయ (హెచ్‌వీఎస్‌)పై, శ్రీనాథ్‌ (ఎంఎల్‌ఆర్‌) 3–0తో ఇషాంత్‌ (ఏడబ్ల్యూఏ)పై, కేశవన్‌ (ఎంఎల్‌ఆర్‌) 3–0తో కమల్‌ (పీఆర్‌ఓటీటీ)పై, విశాల్‌ (జీఎస్‌ఎం) 3–0తో వరుణ్‌పై విజయం సాధించారు.  

బాలికలు: ఇక్షిత (ఏడబ్ల్యూఏ) 3–0తో అఫిఫా (వైఎంసీఏ)పై, ప్రియాన్షి (జీఎస్‌ఎం) 3–1తో పూజ (ఏడబ్ల్యూఏ)పై, విధి జైన్‌ (జీఎస్‌ఎం) 3–1తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై, అనన్య (జీఎస్‌ఎం) 3–1తో శరణ్య (జీఎస్‌ఎం)పై, పలక్‌ (జీఎస్‌ఎం) 3–0తో తేజస్విని (నల్లగొండ)పై, మెర్సీ (హెచ్‌వీఎస్‌) 3–1తో నమ్రత (ఏడబ్ల్యూఏ)పై, దియా (హెచ్‌వీఎస్‌) 3–0తో కీర్తన (హెచ్‌వీఎస్‌)పై, భావిత (జీఎస్‌ఎం) 3–0తో నిఖిత (వీపీజీ)పై గెలుపొందారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top