జైపూర్, దబంగ్‌ ఢిల్లీ మ్యాచ్‌ ‘డ్రా’ | Jaipur Dabang to draw Delhi match | Sakshi
Sakshi News home page

జైపూర్, దబంగ్‌ ఢిల్లీ మ్యాచ్‌ ‘డ్రా’

Dec 21 2018 3:15 AM | Updated on Dec 21 2018 3:15 AM

Jaipur Dabang to draw Delhi match - Sakshi

పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జైపూర్‌ పింక్‌ పాంథర్స్, దబంగ్‌ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 37–37తో ‘డ్రా’గా ముగిసింది.  ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. తొలి సగం ముగిసే సరికి దబంగ్‌ ఢిల్లీ 18–17తో నిలిచింది. జైపూర్‌ తరఫున సెల్వమణి 11, దీపక్‌ హుడా 8 పాయింట్లు సాధించగా... ఢిల్లీ తరఫున చంద్రన్‌ రంజిత్‌ 11, పవన్‌ 9 పాయింట్లు చేశారు. శుక్రవారం నుంచి పోటీలు కోల్‌కతా వేదికగా జరుగనున్నాయి. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్‌ వారియర్స్‌తో తమిళ్‌ తలైవాస్, పుణేరీ పల్టన్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement