ఐఎస్‌ఎల్: కేరళ బ్లాస్టర్స్ గెలుపు | ISL: Kerala outplay table toppers Pune for first win seven matches | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్: కేరళ బ్లాస్టర్స్ గెలుపు

Nov 5 2015 1:52 AM | Updated on Sep 3 2017 12:00 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది

కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పుణే ఎఫ్‌సీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 2-0 గోల్స్ తేడాతో గెలి చింది. ఆట 45వ నిమిషంలో డాగ్‌నల్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన కేరళ జట్టుకు 60వ నిమిషంలో వాట్ రెండో గోల్‌ను అందించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన కేరళ బ్లాస్టర్స్ ఆ తర్వాతి ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం కేరళ జట్టు ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో గోవా ఎఫ్‌సీ జట్టు ఆడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement