భారత్‌ X పాకిస్తాన్‌ | India To Face Pakistan In Under 20 South Asian Football Tournament Today, More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌ X పాకిస్తాన్‌

Mar 26 2026 2:04 AM | Updated on Mar 26 2026 11:48 AM

India to face Pakistan in Under 20 South Asian Football Tournament today

నేడు అండర్‌–20 దక్షిణాసియా ఫుట్‌బాల్‌ టోర్నీలో పోరు 

మాలె (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఏడు జట్లు పాల్గొంటుండగా... పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలిసి భారత్‌ గ్రూప్‌ ‘బి’ నుంచి పోటీ పడుతోంది. 

శనివారం బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ రెండిట్లో ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా... మన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన పాకిస్తాన్‌ జట్టు భారత్‌పై ఏమాత్రం పోరాడుతుందో చూడాలి.     

Advertisement
 
Advertisement
Advertisement