స్నేహపూర్వక బెట్టింగ్ చేశా! | IPL fixing: Gurunath Meiyappan admits to 'friendly betting' through Vindoo Dara Singh | Sakshi
Sakshi News home page

స్నేహపూర్వక బెట్టింగ్ చేశా!

Mar 7 2014 1:40 AM | Updated on Sep 2 2017 4:25 AM

స్నేహపూర్వక బెట్టింగ్ చేశా!

స్నేహపూర్వక బెట్టింగ్ చేశా!

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్న గురునాథ్ మెయ్యప్పన్ పోలీసుల విచారణలో తన తప్పును అంగీకరించినట్టు సమాచారం.

విచారణలో మెయ్యప్పన్
 న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్న గురునాథ్ మెయ్యప్పన్ పోలీసుల విచారణలో తన తప్పును అంగీకరించినట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్‌తో కలిసి స్నేహపూర్వక బెట్టింగ్ చేశానని తెలిపినట్టు ఓ హిందీ చానల్‌లో కథనం ప్రసారమైంది.
 
  పోలీసుల విచారణ నివేదికను కౌన్సిల్ గౌతమ్ భరద్వాజ్, విదుష్‌పత్ సింఘానియా కోర్టుకు అందించారు. విందూకు బుకీలతో నేరుగా సంబంధాలున్నాయని, అతని ద్వారా మెయ్యప్పన్ పందేలు కాసేవాడని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement