
నా నిర్ణయం సరైనదే: మ్యాడ్లీ
యువరాజ్ సింగ్ వేలం సందర్భంగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ విజయ్ మాల్యా చేసిన ఫిర్యాదును ఐపీఎల్ ఆక్షనర్ రిచర్డ్ మ్యాడ్లీ తోసి పుచ్చారు. తాను సరైన నిర్ణయమే తీసుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు.
బెంగళూరు: యువరాజ్ సింగ్ వేలం సందర్భంగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ విజయ్ మాల్యా చేసిన ఫిర్యాదును ఐపీఎల్ ఆక్షనర్ రిచర్డ్ మ్యాడ్లీ తోసి పుచ్చారు. తాను సరైన నిర్ణయమే తీసుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు.
‘వేలంకు సంబంధించి నేను ప్రతిసారీ సరైన విధంగానే వ్యవహరించాను. బుధవారం యువరాజ్ వేలం సమయంలో నేను సరైన, పారదర్శకమైన నిర్ణయమే తీసుకున్నాను. నేను దానికే కట్టుబడి ఉన్నాను’ అని మ్యాడ్లీ స్పష్టం చేశారు. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి మ్యాడ్లీనే ఆక్షనర్‌గా ఉన్నారు.