శ్రీజేశ్‌కు నిరాశ | International Hockey Federation awards | Sakshi
Sakshi News home page

శ్రీజేశ్‌కు నిరాశ

Feb 24 2017 12:47 AM | Updated on Sep 5 2017 4:26 AM

భారత హాకీ జట్టు కెప్టెన్ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌.. రైజింగ్‌ స్టార్‌ హర్మన్ ప్రీత్‌ సింగ్‌లకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్‌) వార్షిక అవార్డుల ప్రకటనలో నిరాశే ఎదురైంది.

చండీగఢ్‌: భారత హాకీ జట్టు కెప్టెన్ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌.. రైజింగ్‌ స్టార్‌ హర్మన్ ప్రీత్‌ సింగ్‌లకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్‌) వార్షిక అవార్డుల ప్రకటనలో నిరాశే ఎదురైంది. వీరిద్దరు ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నా అవార్డులను మాత్రం అందుకోలేకపోయారు. గురువారం ఎఫ్‌ఐహెచ్, హాకీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో భారత ఆటగాళ్లకు నిరాశే మిగిలింది.

బెల్జియంకెప్టెన్ జాన్ జాన్ న్ ( పురుషుల విభాగం), నెదర్లాండ్‌కి చెందిన నవోమి వాన్  (మహిళా విభాగం)  ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచారు. పురుషుల విభాగం లో ఉత్తమ గోల్‌ కీపర్‌గా డేవిడ్‌ హార్తే( ఐర్లాండ్‌), రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఆర్థర్‌ వాన్  డోరెన్ ( బెల్జియం) పతకాలు సాధించగా.. మహిళల  విభాగంలో  ఉత్తమ గోల్‌ కీపర్‌గా మాడీ హించ్‌(గ్రేట్‌ బ్రిటన్ ), రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా మారియా గ్రాన్నెటో(అర్జెంటీనా) అవారు్డలు గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement