హైదరాబాద్ జట్లకే టైటిల్స్ | inter district throwball champions hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ జట్లకే టైటిల్స్

Aug 14 2016 12:47 PM | Updated on Sep 4 2018 5:21 PM

హైదరాబాద్ జట్లకే టైటిల్స్ - Sakshi

హైదరాబాద్ జట్లకే టైటిల్స్

తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు దక్కించుకున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు దక్కించుకున్నాయి. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్‌లో శనివారం జరిగిన ఫైనల్స్‌లో పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు 13-15, 15-9, 15-11తో రంగారెడ్డి జట్టుపై గెలుపొందగా... మహిళల విభాగంలోనూ హైదరాబాద్ జట్టు 13-15, 15-10, 15-12తో రంగారెడ్డి జట్టుపైనే విజయం సాధించింది.

ఈ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ జట్లు వరుసగా రెండోసారి గెలుచుకోవడం విశేషం. పురుషుల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోటీలో వరంగల్ జట్టు 15-09, 13-11తో నిజామాబాద్‌పై, మహిళల కేటగిరీలో ఖమ్మం 15-1, 15-10తో కరీంనగర్‌పై పైచేయి సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్, బోయిన్‌పల్లి ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పల్లవి మోడల్ స్కూల్, అల్వాల్ ప్రిన్సిపాల్ సునీర్ నాగి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement