తెలంగాణ అంతర్ జిల్లా జూనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా జట్లు శుభారంభం చేశాయి.
ఎల్బీ స్టేడియం : తెలంగాణ అంతర్ జిల్లా జూనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా జట్లు శుభారంభం చేశాయి. మహబూబ్‌నగర్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జెడ్పీ హైస్కూల్‌లో గురువారం జరిగిన బాలుర లీగ్ పోటీల్లో హైదరాబాద్ 10-2 స్కోరుతో ఆదిలాబాద్‌పై విజయం సాధించింది.
మహబూబ్‌నగర్ 6-1తో కరీంనగర్‌పై, వరంగల్ 11-1తో నల్లగొండపై గెలిచాయి. బాలికల విభాగంలో హైదరాబాద్ 12-0తో ఆదిలాబాద్‌పై, మెదక్ 5-4తో నిజామాబాద్‌పై, రంగారెడ్డి 10-9తో మహబూబ్‌నగర్‌పై గెలిచాయి.