ఆ అమ్మాయి పేరు...  ‘ఏషియన్‌ గేమ్స్‌’ 

Indonesian parents choose 'Asian Games as name of baby born hours before Aug 18 opening ceremony - Sakshi

ఇండోనేసియా జంటకు ఓ అమ్మాయి జన్మించింది. అది కూడా సరిగ్గా ఆసియా క్రీడలు మొదలైన 18వ తేదీనే కావడం విశేషం. ప్రసవ తేది సెప్టెంబర్‌లో ఉండగా ఓ నెల ముందే కలిగిన ఆ సంతానానికి గేమ్స్‌ పేరే పెట్టారు. ఇండోనేసియాకు చెందిన యొర్డానియా, వెరనొవా డెని దంపతులు. వీరికి ఇదివరకే ముగ్గురు పిల్లలున్నారు. గర్భంతో ఉన్న యొర్డానియాకు వచ్చే నెల డెలివరీ డేట్‌ ఇచ్చారు వైద్యులు.

ఆశ్చర్యంగా ఆమె 18న ఓ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీంతో తల్లిదండ్రులు మెగా ఈవెంట్‌ను పురస్కరించుకొని ఆ చిన్నారికి ‘అబిదా ఏషియన్‌ గేమ్స్‌’ అని పేరు పెట్టారు. అంతేకాదు... తన కుమార్తెను ప్రొఫెషనల్‌ అథ్లెట్‌గా చేస్తానని వెరనొవా డెని చెప్పారు. ‘ఈ పేరు మా పాప భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. తనలో ప్రతిభవుంటే తప్పుకుండా అథ్లెట్‌ను చేస్తా’ అని అన్నారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top