వరల్డ్ కప్ కు మహిళా క్రికెట్ జట్టు ఇదే.. | indian women cricket team for the two tournaments selected | Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్ కు మహిళా క్రికెట్ జట్టు ఇదే..

Feb 5 2016 3:18 PM | Updated on Sep 3 2017 5:01 PM

వరల్డ్ కప్ కు మహిళా క్రికెట్ జట్టు ఇదే..

వరల్డ్ కప్ కు మహిళా క్రికెట్ జట్టు ఇదే..

వచ్చే నెలలో జరుగనున్న మహిళా ట్వంటీ 20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును సెలక్షన్ ప్రకటించింది.

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న మహిళా ట్వంటీ 20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును  సెలక్షన్ ప్రకటించింది. శుక్రవారం భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ )సెలక్షన్ కమిటీ చీఫ్ సందీప్ పాటిల్ నేతృత్వంలో సమావేశమైన బోర్డు సభ్యులు జట్టును ఎంపిక చేశారు. ఈ నెలలో శ్రీలంకతో ఆడనున్న భారత మహిళల జట్టునే ఆసియా, టీ 20 వరల్డ్ కప్ టోర్నీలకు దాదాపు ఎంపిక చేశారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఎంపికతో పాటు, మహిళల జట్టును కూడా సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ రెండు టోర్నీలకు మిథాలీ రాజ్ కే పగ్గాలు అప్పజెబుతూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.  ఈ నెల 24వ తేదీ నుంచి బంగ్లాదేశ్ ఆసియా కప్ ఆరంభం అవుతుండగా,  మార్చి 15 నుంచి మహిళల టీ 20 వరల్డ్ కప్ భారత్ లో జరుగనుంది.


ఆసియా కప్, టీ 20 వరల్డ్ కప్ లకు భారత మహిళా జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్),  జూలన్ గోస్వామి, స్మృతీ మందనా, వేదా కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ కౌర్, శిఖా పాండే, రాజేశ్వరి గ్వైక్వాడ్, సుష్మా వర్మ, పూనమ్ యాదవ్, వీఆర్ వినీత, అనుజా పాటిల్, ఏక్తా బిస్త్, దీప్తి శర్మ, నిరంజనా నాగరాజన్, తిరుష్ కామిని

Advertisement
 
Advertisement
Advertisement