ప్రస్తుతం హోటళ్లు మెరుగైన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న పరిశ్రమ ఇదేనని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్ అన్నారు.
మాదాపూర్, న్యూస్‌లైన్: ప్రస్తుతం హోటళ్లు మెరుగైన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న పరిశ్రమ ఇదేనని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్ అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం ‘ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డు-13’ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫైవ్‌స్టార్, సెవెన్‌స్టార్‌లతో పాటు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారికి అవార్డులను ప్రదా నం చేశారు. హోటల్ రంగంలో 19 విభాగాల్లో 65 అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఏపీ హోటల్స్ అధ్యక్షులు కృష్ణయ్య, గౌరవ సలహాదారు నాగరాజు, తమిళనాడు హోటల్స్ సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బులు, పిక్కీ వైస్ చైర్మన్ జేఏ చౌదరి పాల్గొన్నారు.