విజయంతో ముగించారు | Indian hockey team successfully completed | Sakshi
Sakshi News home page

విజయంతో ముగించారు

Aug 18 2017 12:47 AM | Updated on Sep 17 2017 5:38 PM

విజయంతో ముగించారు

విజయంతో ముగించారు

తమ యూరోప్‌ పర్యటనను భారత హాకీ జట్టు విజయవంతంగా ముగించింది.

ఆస్ట్రియాపై 4–3తో నెగ్గిన భారత్‌  

అమ్‌స్టెల్వీన్‌ (నెదర్లాండ్స్‌): తమ యూరోప్‌ పర్యటనను భారత హాకీ జట్టు విజయవంతంగా ముగించింది. గురువారం ఆస్ట్రియాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టీమిండియా 4–3తో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున రమణ్‌దీప్‌ సింగ్‌ (25వ, 32వ నిమిషాల్లో), చింగ్లెన్‌సన సింగ్‌ (37వ, 60వ నిమిషాల్లో) రెండేసి గోల్స్‌తో చెలరేగారు.

టూర్‌ ఆరంభంలో బెల్జియం చేతిలో వరుసగా రెండు పరాజయాలు  ఎదురైనా... ఆ తర్వాత ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ నెదర్లాండ్స్‌పై భారత్‌ రెండు విజయాలు సాధించి సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement