జపాన్, భారత్ హోరాహోరీగా... | India women hockey team hold Japan to 2-2 draw | Sakshi
Sakshi News home page

జపాన్, భారత్ హోరాహోరీగా...

Aug 7 2016 10:25 PM | Updated on Sep 4 2017 8:17 AM

జపాన్, భారత్ హోరాహోరీగా...

జపాన్, భారత్ హోరాహోరీగా...

చాలా కాలం తర్వాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు పోరాట పటిమను ప్రదర్శించింది.

చాలా కాలం తర్వాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు పోరాట పటిమను ప్రదర్శించింది. మన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న జపాన్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ ను భారత మహిళలు 2-2తో డ్రా చేసుకున్నారు. గ్రూప్-బీ లో భాగంగా జపాన్, భారత్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఇరుజట్లు చెరో రెండు గోల్స్ సాధించడంతో మ్యాచ్ చివరికి డ్రా అయింది.

జపాన్ తరఫున ఇమి నిషికోరి 15వ నిమిషంలో, మియి నకాషిమా 28వ నిమిషంలో గోల్స్ చేసి భారత్ పై ఒత్తిడి పెంచారు. వెంటనే తేరుకున్న భారత క్రీడాకారిణులు రాణి రాంపాల్ 31వ నిమిషంలో, లిలిమా మింజ్ 40వ నిమిషంలో భారత్ కు గోల్స్ అందించి సమం చేశారు. రెండో అర్ధభాగంలో ఇరుజట్లు గోల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినా మూడో గోల్ నమోదు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement