ధోనీసేనదే సిరీస్ | india wins t-20 series against Zimbabwe | Sakshi
Sakshi News home page

ధోనీసేనదే సిరీస్

Jun 22 2016 8:12 PM | Updated on Sep 4 2017 3:08 AM

ధోనీసేనదే సిరీస్

ధోనీసేనదే సిరీస్

జింబాబ్వేతో మూడు టి-20ల సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది.

హరారే: జింబాబ్వేతో మూడు టి-20ల సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన చివరి, మూడో మ్యాచ్లో భారత్ 3 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది. కేదార్ జాదవ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, శ్రణ్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. జింబాబ్వేతో వన్డే సిరీస్ను కూడా ధోనీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

139 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే పూర్తి ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. జింబాబ్వే విజయానికి చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సివుండగా, భారత్ బౌలర్ శ్రణ్.. చిగుంబురను అవుట్ చేశాడు. జింబాబ్వే జట్టులో సిబండ 28, మూర్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లు ధావళ్ కులకర్ణి, శ్రణ్ చెరో రెండు, అక్షర్ పటేల్, చహల్ చెరో  వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (42 బంతుల్లో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. కే ఎల్ రాహుల్ 22, అంబటి రాయుడు 20, అక్షర్ పటేల్ 20 (నాటౌట్) పరుగులు చేశారు. కాగా కెప్టెన్ ధోనీ (9) మరోసారి నిరాశపరచగా, మనీష్ పాండే సున్నా చుట్టేశాడు. జింబాబ్వే బౌలర్లు టిరిపనో మూడు, మడ్జివా, క్రెమెర్ చెరో వికెట్ తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement