
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత్ ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ గదను తిరిగి దక్కించుకోనుంది. గదతో పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడాది పాటు నెంబర్ వన్‌గా ఉన్నందుకు మిలియన్ డాలర్ల నగదు బహుమతిని కూడా సొంతం చేసుకోనుంది. టెస్టు చాంపియన్‌షిప్ గద దక్కించుకోవడం కోహ్లిసేనకు ఇది వరుసగా రెండోసారి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు భారత్ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది.
సఫారీల సిరీస్‌కు ముందు 124 పాయింట్లతో ఉన్న టీమిండియా... సిరీస్‌ను 1–2తో కోల్పోయి ప్రస్తుతం 121 పాయింట్లతో ఉంది. మార్చిలో ఆస్ట్రేలియా, దక్షిణాప్రికాల మధ్య జరిగే మూడు టెస్టుల సిరీస్‌ను సఫారీలో 3–0తో దక్కించుకున్నా... టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానానికి ముప్పుండదు. దీంతో ఈ ఏడాది కూడా టెస్ట్ చాంపియన్‌షిప్ గద మనకే దక్కనుంది.