
కౌలాలంపూర్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్‌లో నేపాల్ జట్టు పెను సంచలనం సృష్టించింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 185 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్ (88; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఆదిత్య, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హిమాంశు రాణా (46; 7 ఫోర్లు, ఒక సిక్స్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యా రు. నేపాల్ బౌలర్ దీపేంద్ర సింగ్ నాలుగు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశాడు.