రెండో ర్యాంక్‌కు భారత్ | India slip to 2nd spot in ICC ODI rankings | Sakshi
Sakshi News home page

రెండో ర్యాంక్‌కు భారత్

Jan 27 2014 1:43 AM | Updated on Sep 2 2017 3:02 AM

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ (117) మళ్లీ రెండో స్థానానికి పడిపోయింది. ఆదివారం తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆస్ట్రేలియా (117) అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ (117) మళ్లీ రెండో స్థానానికి పడిపోయింది. ఆదివారం తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆస్ట్రేలియా (117) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది.
 

 దీంతో దశాంశమానం తేడాతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. అయితే భారత్ మళ్లీ నంబర్‌వన్‌కు చేరాలంటే కివీస్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తీరాలి. అప్పుడు 118 పాయింట్లతో అగ్రస్థానం దక్కుతుంది. లేదంటే రెండో ర్యాంక్‌తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా (110), ఇంగ్లండ్ (109), శ్రీలంక (108) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement