వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది.
హరారే: వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా భారత్ మూడు వన్డే మ్యాచ్లు, మూడు టీ 20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య జూన్ 11 నుంచి 15 వరకూ వన్డే సిరీస్, 18 వ తేదీ నుంచి 22 వరకూ టీ 20 సిరీస్ జరుగనుంది.
జూన్ 11న తొలి వన్డే, జూన్ 13న రెండో వన్డే, జూన్ 15న మూడో వన్డే మ్యాచ్లు జరుగనున్నాయి. తొలి టీ20 జూన్ 18న, రెండో టీ20 జూన్ 20న, మూడో టీ20 జూన్ 22న జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ హరారే స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఫ్రెడ్ ముకొందివా పేర్కొన్నారు. 2010 నుంచి 2015 వరకూ భారత్ మూడు సార్లు జింబాబ్వే పర్యటను వెళ్లిన సంగతి తెలిసిందే.