భారత జట్లకు మూడో గెలుపు | India is the third winning teams | Sakshi
Sakshi News home page

భారత జట్లకు మూడో గెలుపు

Sep 5 2016 1:00 AM | Updated on Sep 4 2017 12:18 PM

ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా మూడో విజయాన్ని సాధించారుు.

బాకు (అజర్‌బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా మూడో విజయాన్ని సాధించారుు. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో భారత పురుషుల జట్టు 3-1తో అజర్‌బైజాన్ ‘బి’ జట్టుపై... మహిళల జట్టు 3.5-0.5తో ఫిలిప్పీన్‌‌స జట్టుపై గెలిచారుు. పురుషుల విభాగం గేముల్లో ఆధిబన్ 53 ఎత్తుల్లో అబసోవ్‌పై, విదిత్ సంతోష్ గుజరాతి 46 ఎత్తుల్లో ఉల్వీ బజరానిపై నెగ్గగా... దురార్‌బైలితో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ 23 ఎత్తుల్లో; గుసినోవ్‌తో గేమ్‌ను సేతురామన్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు.

మహిళల విభాగం గేముల్లో పద్మిని రౌత్ 42 ఎత్తుల్లో జోడిలిన్ ఫ్రోండాపై, తానియా సచ్‌దేవ్ 34 ఎత్తుల్లో క్రిస్టీ లామిల్‌పై, సౌమ్య స్వామినాథన్ 45 ఎత్తుల్లో కాథరీన్‌పై గెలుపొందగా... జానెల్లితో జరిగిన గేమ్‌ను ద్రోణవల్లి హారిక 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement