breaking news
The Indian mens team
-
భారత జట్టుకు ఐదో గెలుపు
బాకు (అజర్బైజాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. అజర్‌బైజాన్‌తో మంగళవారం జరిగిన ఐదో రౌండ్లో భారత్ 3-1తో గెలిచింది. పెంటేల హరికృష్ణ 34 ఎత్తుల్లో మమెదైరోవ్పై, విదిత్ 37 ఎత్తుల్లో నైదిష్పై నెగ్గగా... రద్జబోవ్తో ఆధిబన్, ఎల్తాజ్తో సేతురామన్ ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగంలో వియత్నాంతో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను భారత్ 2-2తో ‘డ్రా’గా ముగించింది. ఎన్గుఝెన్ ఫామ్‌తో హారిక; థి థనాతో సౌమ్య ‘డ్రా’ చేసుకోగా... పద్మిని రౌత్ 61 ఎత్తుల్లో హోవాంగ్పై నెగ్గింది. తానియా సచ్దేవ్ 42 ఎత్తుల్లో థి మాయ్ హంగ్ చేతిలో ఓడిపోరుుంది. -
భారత జట్లకు మూడో గెలుపు
బాకు (అజర్బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా మూడో విజయాన్ని సాధించారుు. ఆదివారం జరిగిన మూడో రౌండ్లో భారత పురుషుల జట్టు 3-1తో అజర్బైజాన్ ‘బి’ జట్టుపై... మహిళల జట్టు 3.5-0.5తో ఫిలిప్పీన్‌స జట్టుపై గెలిచారుు. పురుషుల విభాగం గేముల్లో ఆధిబన్ 53 ఎత్తుల్లో అబసోవ్‌పై, విదిత్ సంతోష్ గుజరాతి 46 ఎత్తుల్లో ఉల్వీ బజరానిపై నెగ్గగా... దురార్బైలితో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ 23 ఎత్తుల్లో; గుసినోవ్తో గేమ్‌ను సేతురామన్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల విభాగం గేముల్లో పద్మిని రౌత్ 42 ఎత్తుల్లో జోడిలిన్ ఫ్రోండాపై, తానియా సచ్దేవ్ 34 ఎత్తుల్లో క్రిస్టీ లామిల్పై, సౌమ్య స్వామినాథన్ 45 ఎత్తుల్లో కాథరీన్పై గెలుపొందగా... జానెల్లితో జరిగిన గేమ్‌ను ద్రోణవల్లి హారిక 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
హాకీ జట్టుకు ఘన స్వాగతం
స్వదేశానికి చేరుకున్న సర్దార్ సింగ్ సేన న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై హాకీ టెస్టు సిరీస్ గెలిచి స్వదేశానికి చేరుకున్న భారత పురుషుల జట్టుకు హాకీ ఇండియా (హెచ్ఐ) మంగళవారం ఘనంగా స్వాగతం పలికింది. కొంత మంది అభిమానులు కూడా విమానాశ్రయానికి వచ్చి అభినందనలు తెలిపారు. సిరీస్ అంతటా తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. ‘200 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నాకు ఇంతకంటే పెద్ద బహుమతి ఉండదు. ఈ విజయాన్ని మర్చిపోలేను. చాంపియన్స్ ట్రోఫీలో రాణించడానికి ఇది స్ఫూర్తినిస్తుంది’ అని సర్దార్ పేర్కొన్నాడు. అద్భుతమైన విజయాన్ని సాధించిన టీమిండియాకు హెచ్ఐ సెక్రటరీ జనరల్ మహ్మద్ ముస్తాక్ అహ్మద్ అభినందనలు తెలిపారు. డిసెంబర్ 6 నుంచి 14 వరకు భువనేశ్వర్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. జర్మనీతో జరిగే తొలి మ్యాచ్‌తో సర్దార్‌సేన ఈ టోర్నీని ప్రారంభిస్తుంది. -
ధోని అండ్ కో... ఇటు చూడండి!
ఇంగ్లండ్‌లో బంతిని ముట్టుకోవడానికే ధోనిసేన ఆపసోపాలు పడుతున్న సమయంలో... భారత మహిళల జట్టు మాత్రం సంచలన ఆటతీరుతో కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడినా... తమకంటే పటిష్టమైన జట్టుపై అలవోకగా గెలిచింది. అన్నట్లు... భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు గెలవడం ఇది వరుసగా రెండోసారి. 2006లోనూ ఏకైక టెస్టులో విజయం సాధించింది. భారత పురుషుల జట్టు ఎప్పుడూ సాధించని ఘనత ఇది. ►ఇంగ్లండ్‌పై భారత్ గెలుపు ►ఏకైక టెస్టులో విజయం ►రాణించిన మిథాలీ వార్మ్స్లే: గత మూడు వారాలుగా ఇంగ్లండ్ గడ్డపై భారత పురుషుల జట్టు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అదరహో అనిపించే బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఏమాత్రం టెక్నిక్ లేకుండా ఆడుతూ పెవిలియన్ వైపు పరుగులు తీస్తున్న వైనం అందరూ చూస్తున్నదే. అయితే ఇదే సమయంలో చడీచప్పుడు లేకుండా భారత మహిళల జట్టు మాత్రం చరిత్ర సృష్టించింది. ధోని బృందం పట్టుమని పది ఓవర్లు ఆడేందుకు ఆపసోపాలు పడుతున్న గడ్డపై.. వీరు మాత్రం తలెత్తుకునే రీతిలో చెలరేగారు. ఆడింది.. ఎనిమిదేళ్ల అనంతరం తొలి టెస్టు. జట్టులో ఏకంగా ఎనిమిది మందికి అసలు టెస్టు అనుభవమే లేదు. అయినా తమకన్నా ఎన్నో రెట్లు పటిష్టమైన ఇంగ్లండ్ మహిళల జట్టును వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి ఔరా అనిపించుకున్నారు. వరుసగా రెండు టెస్టుల్లో ధోని సేన వంద పరుగులు చేసేందుకు సగం మందికి పైగా ఆటగాళ్లను కోల్పోతే వీరు మాత్రం 92 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేయగలిగారు. పట్టుదలతో ఆడితే ఫలితం ఎలా ఉంటుందో తమ ‘సహచర జట్టు’కు రుచి చూపించారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (157 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు) చక్కటి అర్ధ సెంచరీతో ముందుండి నడిపించడంతో శనివారం నాలుగో రోజు చివరి రోజు ఆటలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టును భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఈ విజయం కూడా ఓ రకంగా భారత పురుషుల జట్టుకు చెంపపెట్టు లాంటిదే. ఎందుకంటే వారు ఇప్పటిదాకా ఇక్కడ వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలిచింది లేదు. కానీ మిహ ళా జట్టు 2006లోనూ ఇంగ్లండ్‌ను ఏకైక టెస్టులో ఓడించింది. ఇప్పడు జట్టులో ఉన్న మిథాలీ, కరుణా జైన్, జులన్ గోస్వామి అప్పుడు కూడా ఆడారు. ఇక 119/4 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు బరిలోకి దిగిన భారత్ 95.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 183 పరుగులు చేసింది. శనివారం విజయానికి మరో 62 పరుగులు కావాల్సి ఉండగా 31 ఏళ్ల మిథాలీ ఎలాంటి బెరుకు లేకుండా మరో రెండు సెషన్లు ఉండగానే లాంఛనాన్ని పూర్తి చేసింది. తనకు శిఖా పాండే (106 బంతుల్లో 28; 2 ఫోర్లు) విలువైన సహకారాన్ని అందించింది. ఈ జోడి 30.3 ఓవర్లు ఆడి ఐదో వికెట్‌కు 68 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించింది. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 92, భారత్ తొలి ఇన్నింగ్స్: 114, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 202 భారత రెండో ఇన్నింగ్స్: కామిని ఎల్బీడబ్ల్యు (బి) క్రాస్ 28; మంధానా ఎల్బీడబ్ల్యు (బి) క్రాస్ 51; రౌత్ (సి) గున్ (బి) నైట్ 16; మిథాలీ నాటౌట్ 50; హర్మన్‌ప్రీత్ (సి) టేలర్ (బి) క్రాస్ 0; శిఖా పాండే నాటౌట్ 28; ఎక్స్‌ట్రాలు (బైస్ 2, లెగ్ బైస్ 6, వైడ్లు 1, నోబ్ 1) 10; మొత్తం (95.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1-76; 2-82; 3-112; 4-115. బౌలింగ్: ష్రుబ్సోల్ 23-9-34-0; గున్ 19-6-40-0; క్రాస్ 25-6-42-3; ఒడెడ్రా 12-4-25-0; షివర్ 11.3-3-27-0; నైట్ 5-2-7-1. ‘ఇంగ్లండ్ జట్టు యాషెస్, ప్రపంచకప్ గెలిచింది. కాబట్టి వారిపై మేం సాధించిన ఈ విజయం చిరస్మరణీయం. 2006లో ఇక్కడ టెస్టు ఆడాక మళ్లీ ఈ ఫార్మాట్లో ఆడతానని అనుకోలేదు. ఇక నా కెరీర్ ఎన్నాళ్లు సాగుతుందో తెలియదు. కాబట్టి ఈ విజయం వ్యక్తిగతంగానూ సంతృప్తినిచ్చింది.’ - భారత కెప్టెన్ మిథాలీ రాజ్