టీమిండియాపై గెలవాలంటే..

India Are Better Side Even Without Virat Kohli, Says Pakistan Captain Sarfraz Ahmed - Sakshi

దుబాయ్‌: ఆసియాకప్‌లో టీమిండియాపై గెలవాలంటే తమ జట్టు అన్ని అం‍శాల్లోనూ మెరుగవ్వాల్సి ఉందని పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశాడు. ఆసియాకప్‌ టోర్నీలో హాంకాంగ్‌పై 8 వికెట్ల తేడాతో భారీ విజయం తర్వాత తమ ఆటలో కొన్ని లోపాలు గమనించానని పేర్కొన్నాడు. వాటిని భారత్‌తో మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. 

‘హాంకాంగ్‌ మ్యాచ్‌లో మేమింకా మెరుగవ్వాల్సిన అంశాలను పరిశీలించా. టోర్నీలో అందరికన్నా ముందంజలో నిలవాలంటే మేం తొమ్మిది లేదా పది వికెట్ల తేడాతో గెలవాల్సి ఉంది. మేం కొత్త బంతితో ఇంకా బాగా బౌలింగ్‌ చేయాల్సి ఉంది. కావాల్సినంత స్వింగ్‌ను మేం రాబట్టుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తర్వాత సాధన శిబిరంలో మేం దీనిపై పనిచేస్తాం. హాంకాంగ్‌పై మంచి విజయమే సాధించాం. కానీ భారత్‌పై గెలవాలంటే మాత్రం మేం మూడు విభాగాల్లోనూ అత్యుత్తమంగా ఉండాలి. కోహ్లి లేకపోయినా భారత్‌ జట్టు అత్యుత్తమంగానే ఉంది. కోహ్లి లేడనే విషయాన్ని పక్కకు పెట్టే బరిలోకి దిగుతాం. భారత్‌ను ఓడించాలంటే సమష్టి ప్రదర్శన తప్పదు’ అని సర్ఫరాజ్‌  అహ్మద్‌ అన్నాడు. భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య బుధవారం మ్యాచ్‌ జరుగనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top