అదే మాకు చాన్స్‌ ఇచ్చింది: టేలర్‌

IND Vs NZ: The Total Was A Litte More Than what We Liked To Chase, Latham - Sakshi

హామిల్టన్‌:  తమతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన లక్ష్యం తక్కువైందని అంటున్నాడు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌. ఈ తరహా ఛేజింగ్‌ చేసినప్పుడు అది తమకు పెద్ద లక్ష్యం కనిపించలేదన్నాడు. ‘ చాలాకాలం తర్వాత మా ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన వచ్చింది. దీన్ని ఇలానే సిరీస్‌ ఆద్యంతం కొనసాగిస్తాం. మేము భారీ భాగస్వామ్యాలను నమోదు చేశాం. దాంతో చేజింగ్‌ చిన్నదైపోయింది. ప్రధానంగా మంచి ఆరంభం లభించడంతో మేము స్వేచ్ఛగా ఆడే వీలు దొరికింది. కుడి-ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యింది. లెఫ్ట్‌-రైట్‌ హ్యాండ్‌ కాంబినేషన్‌లో లక్ష్యాలని కాపాడుకోవడం చాలా సందర్భాల్లో చూశాం. ఇది విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మేము కూడా కుడి-ఎడమ ప్రణాళికతలో టీమిండియాపై పైచేయి సాధించాం. నిజంగా రాస్‌ టేలర్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌ అసాధారణం. కానీ మా బౌలింగ్‌ ఆశించిన స్థాయిలో లేదు. మేము బౌలింగ్‌లో ఇంకా గాడిలో పడాలి. తదుపరి మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో దిగుతామనే ఆశిస్తున్నా’ అని లాథమ్‌ తెలిపాడు. (ఇక్కడ చదవండి: గెలుపు ‘రాస్‌’ పెట్టాడు)

అదే మాకు చాన్స్‌ ఇచ్చింది..
టీమిండియాను 350 పరుగుల లోపు కట్టడి చేయడమే తమ గెలుపు ఒక కారణమని రాస్‌ టేలర్‌ పేర్కొన్నాడు. భారత్‌ దూకుడును చూసి ఇంకా భారీ టార్గెట్‌ చేస్దుందని ఆశించామని, కానీ తమ బౌలర్లు చివర్లో కట్టడి చేయడంతో తాము అనుకున్నదాని కంటే తక్కువ స్కోరే వచ్చిందన్నాడు. ఇక తమ బ్యాటింగ్‌లో లెఫ్ట్‌-రైట్‌ హ్యాండ్‌ కాంబినేషన్‌ను కొనసాగించడంతో తమకు బౌండరీలను టార్గెట్‌ చేయడం ఈజీ అయ్యిందన్నాడు. టామ్‌ ఇన్నింగ్స్‌తో ఒత్తిడి తగ్గించాడన్నాడు. ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించాలనే మ్యాచ్‌కు ముందు తమ ఆటగాళ్లతో చెప్పానన్నాడు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top