రహానే ఔట్‌: పర్ఫెక్ట్‌ ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్

IND VS NZ 2nd Test: Wagner Castles Rahane - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: రెండో టెస్టులో టీమిండియా వైస్‌కెప్టెన్‌ అజింక్యా రహానే న్యూజిలాండ్‌ బౌలర్‌ నీల్‌ వాగ్నర్‌ల మధ్య అసక్తికర సమరం జరిగింది. ఈ సమరంలో రహానేపై వాగ్నర్‌ పైచేయి సాధించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో టీమిండియాను ఆదుకునే బాధ్యత రహానే-పుజారాలపై పడింది. అయితే రహానేను ఔట్‌ చేయడానికి కివీస్‌ పక్కా వ్యూహాలను రచించుకుంది. ఈ వ్యూహాలను అమలు చేసే బాధ్యత వాగ్నర్‌కు సారథి విలియమ్సన్‌ అప్పగించాడు. 

పదేపదే లెగ్‌సైడ్‌, లెగ్‌ సైడ్‌ షార్ట్‌పిచ్‌ బంతులతో రహానేను వాగ్నర్‌ ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో రహానే హెల్మెట్‌కు అనేక బంతులు తగిలాయి. దీంతో షార్ట్‌ పిచ్‌ బంతులను భారీ షాట్‌లు ఆడాలని రహానే భావించాడు. కానీ అతడి షాట్‌లు విఫలమవ్వడంతో అనేకమార్లు బంతి గాల్లోకి లేచింది. దీంతో రెండు మూడు మార్లు అతడి అదృష్టం కలిసొచ్చింది. కానీ 31 ఓవర్‌ మూడో బంతిని ఆడటంలో ఘోరంగా తడబడ్డాడు. వాగ్నర్‌ వేసిన లెగ్‌సైడ్‌ బంతిని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైన రహానే ఆ బంతిని వికెట్లపై ఆడి క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో వాగ్నర్‌ ఆనందంతో ఎగిరిగంతేయగా.. రహానే భారంతో క్రీజు వదిలి వెళ్లాడు. పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ ఎగ్జిక్యూషన్‌ అంటే ఇదేనని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. 

చదవండి:
అదే బంతి.. బౌలర్‌ మారాడంతే!
సలాం జడ్డూ భాయ్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top