క్వార్టర్స్‌లో మనోజ్, మదన్‌లాల్ | In the quarter madanlal, Manoj | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో మనోజ్, మదన్‌లాల్

Sep 1 2015 12:28 AM | Updated on Sep 3 2017 8:29 AM

కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు) ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు...

ఆసియా సీనియర్ బాక్సింగ్
బ్యాంకాక్:
కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు) ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మనోజ్‌తోపాటు భారత్‌కే చెందిన మదన్ లాల్ (52 కేజీలు), కుల్‌దీప్ సింగ్ (81 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనోజ్ 3-0తో దీపక్ శ్రేష్ట (నేపాల్)పై, మదన్ లాల్ 3-0తో ముర్తదా అల్ సుదాని (ఇరాక్)పై గెలుపొందగా... చైనా బాక్సర్ ఒలిన్ జాంగ్‌పై కుల్‌దీప్ విజయం సాధించాడు. ఇప్పటికే దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ (75 కేజీలు), మన్‌ప్రీత్ (ప్లస్ 91 కేజీలు), సతీశ్ (91 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. తదుపరి బౌట్‌లలో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంటే వీరందరికీ కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement