అంకుశ్‌ పసిడి పంచ్‌ | In the Mongolia boxing tournament, India's young boxer bagged the gold medal. | Sakshi
Sakshi News home page

అంకుశ్‌ పసిడి పంచ్‌

Jun 26 2017 3:29 AM | Updated on Sep 5 2017 2:27 PM

అంకుశ్‌ పసిడి పంచ్‌

అంకుశ్‌ పసిడి పంచ్‌

ఉలాన్‌బాటర్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత యువ బాక్సర్‌ అంకుశ్‌ దహియా సత్తా చాటాడు.

న్యూఢిల్లీ:  ఉలాన్‌బాటర్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత యువ బాక్సర్‌ అంకుశ్‌ దహియా సత్తా చాటాడు. మంగోలియాలో ఆది వారం ముగిసిన ఈ టోర్నీలో అతను పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

60 కేజీల విభాగం ఫైనల్లో 19 ఏళ్ల అంకుశ్‌ కొరియాకు చెందిన చో చోల్‌ను ఓడించాడు. మణిపూర్‌కు చెందిన దేవేంద్రో సింగ్‌ (52 కేజీలు) రజతాన్ని సాధించాడు. ఫైనల్లో దేవేంద్రో 2–3తో సుగురో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మొత్తం ఈ టోర్నీలో భారత్‌ స్వర్ణం, రజతం, 3 కాంస్య పతకాలను సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement