టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు చెందిన అకాడమీలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు.
మొయినాబాద్, న్యూస్‌లైన్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు చెందిన అకాడమీలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. రెండు వారాలపాటు ప్రాక్టీస్ చేసేందుకు సోమ్‌దేవ్ దేవ్‌వర్మ, రోహన్ బోపన్న, సోనమ్‌సింగ్, సాకేత్, జీవన్, విష్ణువర్ధన్, బాలాజీ వస్తున్నారని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా తెలిపారు.
వారి ప్రాక్టీస్ సోమవారం నుంచే ప్రారంభమవుతుందని, మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ ఉంటుందన్నారు. ఆదివారం సానియా మీర్జా తన అకాడమీలో ఈ ఏర్పాట్లను పర్యవేక్షించింది. ఈ సందర్భంగా తనతోపాటు డబుల్స్ జోడి క్లారాబ్లాక్ (జింబాబ్వే), ఆస్ట్రేలియాకు చెందిన ఫిజికల్ ట్రెయినర్ రాబర్ట్ బలాడ్ కూడా ఉన్నారు. వీరంతా అకాడమీలో శిక్షణ పొందుతున్న చిన్నారులతో కలిసి ప్రాక్టీస్ చేశారు.