ఇక సచిన్ క్రికెట్ కిట్ | I Want to Help Poorest Kids Play Cricket: Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

ఇక సచిన్ క్రికెట్ కిట్

Jul 13 2016 12:14 AM | Updated on Sep 4 2017 4:42 AM

భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త్వరలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.

లండన్: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త్వరలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. క్రికెట్ వస్తువులను తయారు చేసే ‘స్పార్టన్ ఇంటర్నేషనల్’తో మాస్టర్ చేతులు కలిపాడు. సంస్థలో పెట్టుబడితో పాటు సలహాదారుల బోర్డులో సభ్యుడిగా చేరాడు. దీంతో హెల్మెట్స్, గ్లోవ్స్, లెగ్ గార్డ్స్‌తో పాటు ఇతర క్రికెటింగ్ ఉత్పత్తుల్లో ఇక నుంచి మాస్టర్ మార్క్ కనబడనుంది.  ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను ఎన్నోసార్లు గాయపడ్డానని గుర్తు చేసిన మాస్టర్... ఇప్పుడు కొత్త రకం గ్లౌవ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నాడు.

ఓవరాల్‌గా మాస్టర్ మార్క్‌తో రూపు దిద్దుకునే క్రికెటింగ్ వస్తువులు అక్టోబర్ 1 నుంచి మార్కెట్‌లోకి రానున్నాయి.  1953లో జలంధర్‌లో ఫుట్‌బాల్‌లను తయారు చేసే చిన్న కంపెనీ స్పార్టన్ నేడు ప్రపంచ వ్యాప్తంగా  క్రీడావస్తువులను రూపొందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement