బయటకు రావడం షాక్: మెకల్లమ్ | I have never ever fixed a cricket match, says Brendon McCullum | Sakshi
Sakshi News home page

బయటకు రావడం షాక్: మెకల్లమ్

May 23 2014 12:57 AM | Updated on Sep 2 2017 7:42 AM

బయటకు రావడం షాక్: మెకల్లమ్

బయటకు రావడం షాక్: మెకల్లమ్

మ్యాచ్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా ఐసీసీ ఏసీఎస్‌యూకి తానిచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడంపై న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.

క్రైస్ట్‌చర్చ్: మ్యాచ్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా ఐసీసీ ఏసీఎస్‌యూకి తానిచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడంపై న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తన భార్య మూడో సంతానానికి జన్మనివ్వనున్న కారణంగా మెకల్లమ్ ఐపీఎల్ నుంచి స్వదేశానికి వచ్చాడు. ‘ముందుగా నేనో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఇప్పటిదాకా ఏ క్రికెట్ మ్యాచ్‌నూ నేను ఫిక్స్ చేయలేదు.
 
 ఈ ఆటలో నెలకొన్న అవినీతిపై పోరాడేందుకు వంద శాతం సిద్ధంగా ఉన్నాను. నమ్మకంతోనే ఐసీసీకి నేను వాంగ్మూలం ఇచ్చాను. అయితే మీడియాలో ఇదంతా రావడం షాక్‌కు గురిచేసింది. అయితే మున్ముందు కూడా ఐసీసీకి ఈ విషయంలో సహకారం అందిస్తాను’ అని మెకల్లమ్ వివరించాడు.
 లూ విన్సెంట్‌పై ఈసీబీ అభియోగాలు
 లండన్: మూడేళ్ల క్రితం కౌంటీ మ్యాచ్‌ను ఫిక్స్ చేసినందుకు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్, అతడి ససెక్స్ సహచరుడు ఆరిఫ్‌లపై ఇంగ్లండ్  బోర్డు చర్యలకు సిద్ధమవుతోంది. 15కు పైగా కౌంటీ మ్యాచ్‌లను వీరిద్దరు ఫిక్స్ చేశారని అభియోగాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement