హైదరాబాద్‌కు ఓవరాల్‌ టైటిల్‌

Hyderabad Wins Overall Title Of Athletics Championship - Sakshi

అండర్‌–16 బాలికల విభాగంలో అగ్రస్థానం

అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన కౌశిక్‌ స్వర్ణంతో మెరిశాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్‌ స్టేడియంలో శనివారం జరిగిన బాలుర అండర్‌– 20 డెకాథ్లాన్‌లో కౌశిక్‌ 4,414 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. 3,137 పాయింట్లతో ఉదయ్‌ కుమార్‌ (రంగారెడ్డి) రెండో స్థానంలో, 2414 పాయింట్లతో తరుణ్‌ (వికారాబాద్‌) మూడో స్థానంలో నిలిచారు.

బాలికల అండర్‌–16 టీమ్‌ విభాగంలో హైదరాబాద్‌ జట్టు 27 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. బాలికల అండర్‌–18 100 మీటర్ల హర్డిల్స్‌ పరుగును అందరికంటే వేగంగా 14.82 సెకన్లలో ముగించి సీహెచ్‌ పద్మశ్రీ పసిడిని కైవసం చేసుకుంది. రెండో స్థానంలో నందిని (మేడ్చల్‌) నిలిచి రజతాన్ని గెలిచింది.  
ఇతర పతక విజేతలు: అండర్‌–14 బాలుర విభాగం: 600 మీ: 1. కె.శ్రీను (నాగర్‌ కర్నూల్‌) 2. బి.వినోద్‌ కుమార్‌ (జయశంకర్‌ భూపాలపల్లి) 3.టి.ప్రవీణ్‌ (వరంగల్‌ అర్బన్‌). అండర్‌–16: 800 మీ: 1. కె.తరుణ్‌ (నాగర్‌ కర్నూల్‌) 2.బి.రమేశ్‌ (వరంగల్‌ అర్బన్‌) 3.కృష్ణ (వనపర్తి). 2000 మీ: 1.వై.రితీశ్‌ కుమార్‌ (రంగారెడ్డి), 2.కృష్ణ (వనపర్తి), 3. రక్షిత్‌ (సూర్యాపేట). అండర్‌–18 800మీ: 1. దుర్గా రావు (వరంగల్‌ అర్బన్‌) 2. హనుమంత నాయక్‌ (మహబూబాబాద్‌) 3.ప్రియాన్షు (హైదరాబాద్‌).  3000మీ: 1.ప్రేమ్‌ సాగర్‌ (మంచిర్యాల) 2. శివ (నాగర్‌ కర్నూల్‌) 3. రమేశ్‌ (నాగర్‌ కర్నూల్‌). అండర్‌–20 800మీ: 1. గోíపీ చంద్‌ (రంగారెడ్డి) 2. వినోద్‌ నాయక్‌ (వనపర్తి) 3. వంశీ కృష్ణ.  

అండర్‌–14 బాలికల విభాగం: 600 మీ: 1. కీర్తన (నాగర్‌ కర్నూల్‌) 2. ఝాన్సీ బాయి (హైదరాబాద్‌) 3. కల్యాణి (సూర్యాపేట). అండర్‌–16: 800మీ: 1. శ్రేయ (హైదరాబాద్‌) 2. ఉమా మహేశ్వరి (సూర్యాపేట) 3. లావణ్య (మహబూబ్‌నగర్‌). 2000 మీ: 1.సిహెచ్‌ రాఘవి (హైదరాబాద్‌) 2. అఖిల (సూర్యాపేట) 3. మల్లిక (యాదాద్రి). అండర్‌–20: 200మీ: 1. కవిత (కరీంనగర్‌) 2. సుష్మ (భద్రాద్రి) 3. శ్రావణి (వికారాబాద్‌).

టీం చాంపియన్‌షిప్‌ విజేతలు
ఓవరాల్‌: ఖమ్మం; బాలుర విభాగం: అండర్‌– 14: మంచిర్యాల, అండర్‌– 16: ఖమ్మం; అండర్‌– 18: వరంగల్‌ అర్బన్‌; అండర్‌– 20: భద్రాద్రి కొత్తగూడెం.
బాలికల విభాగం: అండర్‌– 14: హైదరాబాద్, అండర్‌– 18: రంగారెడ్డి, అండర్‌– 20:   హైదరాబాద్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top