ఆసియా టెన్నిస్‌ టోర్నీకి చాహన | Hyderabad Tennis Player Chahana Qualified to Asia Tennis Tourney | Sakshi
Sakshi News home page

ఆసియా టెన్నిస్‌ టోర్నీకి చాహన

May 7 2019 3:17 PM | Updated on May 7 2019 3:17 PM

Hyderabad Tennis Player Chahana Qualified to Asia Tennis Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్‌ ప్లేయర్‌ చాహన బుద్ధపాటి గొప్ప అవకాశాన్ని అందుకుంది. ఐటీఎఫ్‌ ఆసియా టెన్నిస్‌ అండర్‌–14 డెవలప్‌మెంట్‌ డివిజన్‌–1 చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు చాహన ఎంపికైంది. ఉజ్బెకిస్తాన్‌లో  సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ ఈనెల 19 వరకు జరుగుతుంది.

ప్రస్తుతం ఆలిండియా అండర్‌–14 ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న చాహనతో పాటు పరీ సింగ్, సుహిత బాలికల జట్టుకు ఎంపికయ్యారు. బాలుర జట్టులో ఆయుష్మాన్, ఆగ్రేయ, యువన్‌ చోటుదక్కించుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement