బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ రూహి | hyderabad girl ruhi wins usa badminton championship | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ రూహి

Jul 9 2017 10:53 AM | Updated on Aug 24 2018 9:03 PM

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ రూహి - Sakshi

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ రూహి

యూఎస్‌ఏ జూనియర్‌ నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి రూహి రాజు సత్తా చాటింది.

సాక్షి, హైదరాబాద్‌: యూఎస్‌ఏ జూనియర్‌ నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి రూహి రాజు సత్తా చాటింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ టోర్నీలో 13 ఏళ్ల రూహి సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను గెలుచుకుంది. బాలికల సింగిల్స్‌ ఫైనల్లో రూహి 22–20, 18–21, 21–15తో మూడో సీడ్‌ నేత్రపై విజయం సాధించింది.

 

అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో 2017 జూనియర్‌ ఇంటర్నేషనల్‌ ట్రయల్స్‌ విజేత జోలీ వాంగ్‌ను వరుస గేముల్లో ఓడించి రూహి ఫైనల్‌కు చేరుకుంది. లీగ్‌ దశలోనూ తన కన్నా మెరుగైన క్రీడాకారులను ఓడించి ఆమె ఆకట్టుకుంది. ప్రస్తుతం సుచిత్ర బ్యాడ్మింటన్‌ అకాడమీలో రూహి శిక్షణ తీసుకుంటోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement