హైదరాబాద్‌ పరాజయం | hyderabad defeated in badminton championship opener | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పరాజయం

May 30 2017 10:24 AM | Updated on Sep 4 2018 5:07 PM

అంతర్‌ జిల్లా జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌ జట్టు ఓటమితో ప్రారంభించింది.

హైదరాబాద్: అంతర్‌ జిల్లా జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌ జట్టు ఓటమితో ప్రారంభించింది. అణుపురం గ్రౌండ్స్‌లో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ బాలుర జట్టు 15–35, 18–35తో వరంగల్‌ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో కరీంనగర్‌ జట్టు 35–23, 35–30తో మెదక్‌పై, ఖమ్మం 35–30, 35–29తో నల్లగొండపై, నిజామాబాద్‌ 35–17, 34–36, 35–18తో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్‌ 35–26, 35–20తో మెదక్‌పై, నిజామాబాద్‌ 35–27, 35–16తో కరీంనగర్‌ జట్టుపై గెలుపొందాయి.

 

బాలికల విభాగంలో ఖమ్మం జట్టు 35–22, 35–24తో నిజామాబాద్‌ జట్టుపై గెలిచి శుభారంభం చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో ఆదిలాబాద్‌ 35–9, 35–8తో రంగారెడ్డిపై, వరంగల్‌ 35–18, 35–19తో మెదక్‌పై నెగ్గి ముందంజ వేశాయి. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్‌. వేణుగోపాలాచారి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాప్రా మున్సిపాలిటీ కార్పొరేటర్‌ పావని రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, అణుపురం సొసైటీ అధ్యక్షులు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం కార్యదర్శి ఎ. రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement