హాకీ సిరీస్ భారత్ కైవశం | hockey india wins series by 3-1 against australia | Sakshi
Sakshi News home page

హాకీ సిరీస్ భారత్ కైవశం

Nov 9 2014 6:41 PM | Updated on Sep 2 2017 4:09 PM

హాకీ ఇండియా పురుషుల జట్టు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్ ను కైవసం చేసుకుంది.

పెర్త్: హాకీ ఇండియా పురుషుల జట్టు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్ ను కైవశం చేసుకుంది. ఆదివారం జరిగిన నాల్గో మ్యాచ్ లో భారత హాకీ ఆటగాళ్లు 3-1 తేడాతో విజయభేరి మోగించారు. వారి సొంత గడ్డపైనే  వరుస మ్యాచ్ ల్లో ఆసీస్ ను మట్టికరిపించిన భారత్  సిరీస్ ను 3-1 తేడాతో చేజిక్కించుకుంది.

 

ఆదివారం నాటి మ్యాచ్ లో అద్భుతం చేసిన హాకీ ఇండియా అదే ఆట తీరును కనబరిచి ఆస్ట్రేలియా ఆశలకు చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావించిన ఆస్ట్రేలియాకు  చుక్కెదురైంది.  ఏ దశలోనూ అవకాశం ఇవ్వని హాకీ ఇండియా ఆటగాళ్లు తన సత్తాను మరోసారి రుచి చూపించి టైటిల్ ను ఎగురేసుకుపోయారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అనంతరం మంచి ఊపుమీద ఉన్న భారత జట్టు తన విజయ యాత్రను కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement