
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా వైట్‌వాష్ అయ్యింది. తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన సఫారీలు.. రెండో టెస్టులోనూ అదే ఆట తీరుతో మరో భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. ఫలితంగా సిరీస్‌ను 0-2 తేడాతో శ్రీలకంకు సమర్పించుకున్నారు. శ్రీలంక నిర్దేశించిన 490 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే పరిమితమైంది. దాంతో 199 పరుగుల తేడాతో పరాజయం చెందింది.
139/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాల్గో రోజు ఆట కొనసాగించిన సఫారీలు.. లంక స్పిన్నర్ హెరాత్ ధాటికి విలవిల్లాడారు. రెండో ఇన్నింగ్స్‌లో హెరాత్ ఆరు వికెట్లు సాధించి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. డి బ‍్రుయెన్(101), బావుమా(61) పోరాడినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు. హెరాత్‌కు జతగా, దిల్రువాన్ పెరీరా, అఖిల ధనంజయలు తలో రెండు వికెట్లు తీసి లంకకు ఘన విజయాన్ని అందించారు.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 338 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 275/5 డిక్లేర్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 124 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 290 ఆలౌట్