ఆమ్లా డబుల్ సెంచరీ | hashim amla gets double century in second test | Sakshi
Sakshi News home page

ఆమ్లా డబుల్ సెంచరీ

Jan 5 2016 4:24 PM | Updated on Sep 3 2017 3:08 PM

ఆమ్లా డబుల్ సెంచరీ

ఆమ్లా డబుల్ సెంచరీ

గతేడాదిగా పేలవమైన ఫామ్ తో తంటాలు పడ్డ దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా ఎట్టకేలకు తిరిగి గాడిలో పడ్డాడు.

కేప్ టౌన్:గతేడాదిగా పేలవమైన ఫామ్ తో తంటాలు పడుతున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆమ్లా డబుల్ సెంచరీ తో అదరగొట్టాడు.  నాలుగు రోజు ఆటలో ఆమ్లా(200 బ్యాటింగ్;467 బంతుల్లో 27 ఫోర్లు) రాణించడంతో దక్షిణాఫ్రికా లంచ్ సమయానికి 160.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 428 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆమ్లాకు జతగా  డు ప్లెసిస్(88 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు.  


358/3 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా లంచ్ విరామానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది.  అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ను 629/6 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.  తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement